బాలాదిత్య హీరోగా "హే రామా ఏంటీ గోల"
|
ఈ నెలాఖరుతో తొలిషెడ్యూల్ పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. సస్పెన్స్, కామెడీ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రం, అన్నివర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. హాలీవుడ్‌లో పనిచేసిన రాజేస్ కె. కతూరి కెమేరామెన్‌గా పనిచేయడం చిత్రానికి ప్లస్ అవుతుందని, మూడో షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తి చేస్తామని నిర్మాత అన్నారు.
దువ్వాసి మోహన్, కొండవలస, పృథ్వీ, అన్నపూర్ణ, అభినయశ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు... అల్లూరి సీతారామరాజు, సంగీతం... రాజ్ కిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత... రాజేంద్ర రెడ్డి.