స్నేహం విలువను చాటి చెప్పే ''నా అనేవాడు''
|
స్నేహం కోసం ప్రాణమిచ్చే పాత్రలో హరీష్, దేన్ని ఆశించని సాఫ్ట్ పాత్రను రాజీవ్ పోషిస్తున్నారని చెప్పారు. భిన్నమనస్తత్వాలు కలిగిన వీరిద్దరి చుట్టూత జరిగే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. జులై 10వ తేదీన తొలికాపీ వస్తుందని, ఇదే నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఆలీ, ఎంఎస్, వేణుగోపాల్, సాయికిరణ్, శ్రీధర్, రాజేంద్ర, శివారెడ్డి, తెలంగాణా శకుంతల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు... రైటర్ మోహన్, కెమెరా... సూర్య, కథ, నిర్మాణం... సద్గురు సాయి క్రియేషన్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... టి.ప్రశాంత్.