ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైభవంగా "హరేరామ్" ఆడియో విడుదల  Search similar articles
కళ్యాణ్ రామ్
WD PhotoWD
నందమూరి వంశీయులంతా ఒకే వేదికపై కలవడానికి రామానాయుడు స్టూడియోలో జరిగిన హరేరామ్ ఆడియో వేడుక వేదికైంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ లోగోను హరికృష్ణ ఆవిష్కరంచారు. అనంతరం నందమూరి బాలకృష్ణ ఆడియో కేసెట్‌ను ఆవిష్కరించగా, సీడీని మంచు మోహన్‌బాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... తామంతా కలిసికట్టుగా ఈ వేదికపై ఉన్నామని, ఎప్పుడూ ఐక్యతతో ఉంటామని, ఇకపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తీసిపారేయండని చెప్పారు. ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడాలని తన ముగ్గురు కుమారులైన జానకిరామ్, కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావుల బోధించానని, అందులో ఆఖరి కుమారుడు హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడని, ముగ్గురూ చదువుకోవాలని సూచించానని అన్నారు.

విద్య దోచుకోలేని ధనమని, అందుకే వారిని చదివించానని, ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోమని చెప్పానని వెల్లడించారు. స్వశక్తితో ముందుకెళ్లాలని, ఎవరికీ తన వంతు సహాయం అందించనని, వారి వారి కాళ్లపై నిలబడాలని చెప్పానన్నారు.

ముందుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ సినిమాలో రావాలని అడిగితే ఓ సారి మాత్రం సాయం చేశానని, ఈ రోజు ఇంత స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని హరికృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత తాతగారి బేనర్‌ను స్థాపిస్తానని కళ్యాణ్ రామ్ కోరికకు సమ్మతించానని, అయితే అందులో అశ్లీలం ఉండకూడదని నిబంధన పెట్టానని కృష్ణ తెలిపారు. అందుకే తమ బేనర్‌లో వచ్చే చిత్రాలు ఆడపడుచులతో కలిసి చూడవచ్చునని అన్నారు.

ముఖ్య అతిథి మోహన్ బాబు మాట్లాడుతూ.. తళ్లా పెళ్లామా.. డ్రైవర్ రాముడు చిత్రాల నుంచి హరికృష్ణ తనను అన్నయ్యా అని ఆప్యాయంగా పిలిచేవాడని, వీరంతా తన కుటుంబ సభ్యులేనని అన్నారు. పాండురంగడు చిత్రంలో బాలయ్య పోషించిన కృష్ణుని పాత్ర చూస్తుంటే అన్న ఎన్టీఆర్‌నే ప్రత్యక్షంగా చూసినట్లుందని, అంత చక్కగా పాత్రకు సరిపోయాడని ప్రశంసల వర్షం కురిపించారు. నిజం చెప్పాలంటే.. "అతనొక్కడే" చిత్రానికి తానే క్లాప్ కొట్టానని, సూపర్ హిట్ అయిందని ఆ సినిమాను చాలా రిస్క్ చేసి నటించిన కళ్యాణ్‌రామ్, గట్టిపోటీతో పట్టుదలతో ముందుకు సాగాడని వివరించారు.

హరేరామ్ అనే టైటిల్ నా కుమారుడు విష్ణు సినిమాకు టైటిల్ పెట్టాలని రిజిస్టర్ చేశానని, విష్ణుతో సినిమా చేయాలనుకుంటూనే, తిరుపతి వెళ్లానని, అప్పుడు విష్ణు ఫోన్‌చేసి "హరేరామ్" టైటిల్ కళ్యాణ్‌రామ్ అడుగుతున్నాడని చెప్పాడు. వెంటనే ఇచ్చేయమని చెప్పానని, తన బిడ్డకంటే గొప్పవాడు కావాలని కళ్యాణ్‌రామ్‌ను దీవిస్తూ ఆ టైటిల్ ఇచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. హిందీలో "హరేరామ్ హరేకృష్ణ" ఎంత హిట్ అయిందో అంతకంటే కళ్యాణ్ రామ్ "హరేరామ్" హిట్ కావాలని మోహన్ బాబు ఆకాంక్షించారు.

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకీరోజు పండుగల ఉందని, బాబాయ్, నాన్న, అన్నయ్యలతో పాటు మామయ్య మోహన్ బాబుతో కలిసి వేదికపై ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది కంత్రి, పాండురంగడు హిట్టయ్యాయని, అలాగే హరేరామ్ కూడా హిట్ అవుతుందని చెప్పారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. కళ్యాణ్ రామ్ చిత్రం విజయవంతం కావాలని వందరోజులు కార్యక్రమంలో కలుసుకుందామని చెప్పారు.
మరిన్ని
స్నేహం విలువను చాటి చెప్పే 'నా అనేవాడు'
అభిమాని కుటుంబానికి "ఎన్టీఆర్" ఆర్థిక సాయం
"దీపావళి" ఆడియో రిలీజ్
బాలాదిత్య హీరోగా "హే రామా ఏంటీ గోల"
చక్కని కుటుంబ కథా నేపథ్యంలో "అడుగు"
పులికోసం తలకోనకు వెళ్తున్న పవన్‌కళ్యాణ్