1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రజనీకాంత్ ''కథానాయకుడు'' ఆడియో విడుదల

రజనీకాంత్ 'కథానాయకుడు' ఆడియో విడుదల
అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కథానాయకుడు' చిత్రం ఆడియో ఆవిష్కరణ జూన్ 30 రాత్రి చెన్నై లీ మెరిడన్ హోటల్‌‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు సుప్రసిద్ధ దర్శకులు కె.బాలచందర్ అధ్యక్షత వహించారు. రజనీకాంత్, జగపతిబాబు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, సీనియర్ డైరెక్టర్ భారతీరాజా తదితర అతిరథమహారథులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'కథానాయకుడు' ఆడియోను జగపతిబాబు తండ్రి, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత వి.బి.రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించగా, 'కుచేలన్' ఆడియోను అగ్రదర్శకులు పద్మశ్రీ కె.బాలచందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ... "అశ్వనీదత్ మంచి ఫలిమ్ మేకర్. షూటింగ్ చేస్తున్నప్పుడు ఏది కావాలన్నా క్షణాల్లో షూటింగ్ స్పాట్‌కు తెప్పించే కెపాసిటీ ఆయనలో వుంది. అశ్వనీదత్ గారి బ్యానర్‌లో సినిమా చేయడం చాలా హేపీగా ఫీలవుతున్నాను" అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT