నాగబాబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న "ఏక్ పోలీస్" 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం గురించి నిర్మాత ఎన్.హెచ్. భాస్కరరెడ్డి చెబుతూ నంద్యాలలో లక్షలాది ప్రజల మధ్య చిత్రించిన ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. దర్శకుడు కోడిరామకృష్ణ ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్‌ను వెరైటీగా తీర్చిదిద్దారు.
నాగబాబు కెరీర్‌లో మైలురాయిలా ఈ చిత్రం నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు కోడిరామకృష్ణ మాట్లాడుతూ... ఇంతకుముందు తాను తీసిన అంకుశం, భారత్ బంద్.. చిత్రాల్లో చెప్పిన అంశాలు ఇప్పడు ఆచరణలోకి వచ్చాయని, ఈ ఏక్‌పోలీస్ సినిమాలో కూడా సమాజానికి ఉపయోగపడే కొన్ని కొత్త విషయాలు చెబుతున్నామని చెప్పారు.
నాగబాబు పెర్‌ఫార్మెన్స్ ఈ సినిమాకు ఒక హైలైట్ అని, విజయ్ సామ్రాట్, భూషణ్, ధీరజ్, సూర్యచరణ్, గాయత్రి చేస్తున్న పాత్రలు యువతరానికి ప్రతినిధులుగా కనిపిస్తాయని వెల్లడించారు. ఎన్‌హెచ్. రుష్యా ప్రొడక్షన్స్ బేనర్‌పై బేబి రుష్యారెడ్డి సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం.. కోటి.
|