తేజకు కొత్త ఆలోచన!
|
ఈ నేపథ్యంలో తేజకు కొత్త ఆలోచన తట్టిందట.. అదేమిటో తెలుసా... "కేక" సినిమా పాటలను రిలీజ్‌కు ముందే ఒక్కో పాటను అర నిమిషం వ్యవధిలో అన్ని ఎఫ్.ఎం రేడియోలకు ఇచ్చేస్తే వారు రెగ్యులర్‌గా ప్రసారం చేస్తారు. అవి బాగున్నాయన్న రిపోర్ట్ కూడా రావచ్చు.
అప్పుడు క్యాసెట్, సీడిని మార్కెట్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయ పడుతున్నారు. ఈ పద్ధతి ద్వారా ఆడియో కంపెనీకి, తమకూ లాభదాయకంగా ఉంటుందని తేజ అంటున్నారు. మరి రేపు మరేదో ఆలోచన వస్తే దాన్ని కూడా అమలు చేస్తానంటున్నారు తేజ.. ఇంతకీ "కేక" సినిమాకు ఎన్ని ఆలోచనలో కదా..