1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"అల్లరి నరేష్" కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు

WD PhotoWD
అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రానికి "సిద్ధు ఫ్రమ్ సికాకుళం" టైటిల్‌ను ఖరారైంది. ప్రసాద్ ల్యాబ్ ఆవరణలో చిత్ర టైటిల్‌‌ను యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో నరేష్ సరసన శ్రద్ధాదాస్ నటిస్తోంది. వెల్‌ఫేర్ క్రియేషన్స్ పతాకంపై మళ్ల విజయప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత సారథ్యం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... సినిమా తీయాలనే ఆసక్తితో రియల్ ఎస్టేట్ రంగం నుంచి సినీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టానని చెప్పారు. పూర్తిస్థాయిలో వినోదభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. ఐదు షెడ్యూల్స్‌తో సినిమాను పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు.

హీరో నరేష్ మాట్లాడుతూ.. ఇంతకుముందు 25 చిత్రాల్లో నటించినప్పటికీ... ఇప్పటివరకు కాలేజీ స్టూడెంట్ పాత్రలో నటించలేదని, తొలిసారి ఇందులో కాలేజ్ స్టూడెంట్ పాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నారు. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయిందని, ఈ నెల 25న ఆడియోను, వచ్చే నెల 14న సినిమాను విడుదల చేస్తామని నరేష్ వెల్లడించారు.

ఈ సినిమాను కొత్తకోణంలో తెరకెక్కించేందుకు యూనిట్ కృషిచేస్తోందని దర్శకుడు ఈశ్వర్ చెప్పారు. సికాకుళం నుంచి సిద్ధు పట్టణానికి ఎందుకు వచ్చాడు, అక్కడ అతనికి ఎదురైన అనుభవాలనే చిత్రంగా రూపొందించామని దర్శకుడు తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో వేణుమాధవ్, ధర్మవరపు, చంద్రమోహన్, విజయరంగరాజు, అమిత్, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
About Writer
Selvi