"ఇంద్రజిత్"లో ప్రిన్సిపాల్‌గా రమ్యకృష్ణ
|
ఇంద్రజిత్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెలలో మిగిలిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో స్కూల్ ప్రిన్సిపాల్ పాత్ర పోషించడం పట్ల నటి రమ్యకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.
దర్శకుడు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... మిటరీ మేజర్‌గా సాయికుమార్, ఆయన భార్యగా సంగీత, వారి తనయుడిగా ఇంద్ర, తండ్రి పాత్రలో విజయ్ చందర్ నటిస్తున్నారని వెల్లడించారు. కథానుగుణంగా తీవ్రవాద సమస్యను చర్చించడం జరుగుతుందని వెల్లడించారు.
నేటి విద్యా విధానంలో విద్యార్థులు, తల్లిదండ్రుల పాత్రలపై కూడా కథానుగుణంగా సన్నివేశాలుంటాయని ఆయన తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి పాటలు... ఇంద్రప్రసాద్, సంగీతం.. కుమార్, మాటలు... వేమగిరి, కెమెరా... అంజి.