మలేషియాలో "కౌసల్య సుప్రజ రామ"
|
అనంతరం హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తామని, దీంతో సినిమా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత రామానాయుడు తెలిపారు. బుధవారం వరకు జరిగిన షెడ్యూల్‌తో దాదాపుగా టాకీ పార్ట్ పూర్తయిందన్నారు.
కథ, స్క్రీన్‌ప్లేలు సమకూర్చిన సూర్యప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా కోసం సంగీత దర్శకులు రమణ గోగుల, ఎంఎం శ్రీలేఖ పాట పాడారని ఆయన అన్నారు. కౌసల్యా నచ్చావే.. అందంతో గిచ్చావే.. అంచేతే నచ్చావే.. అనే పాటకు వీరిద్దరు గొంతు కలిపారు. రామజోగయ్యశాస్త్రి ఈ పాటను రాయగా, ఈ చిత్రానికి కోటి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇకపోతే శ్రీకాంత్ సరసన గౌరి మంజల్ కూడా నటిస్తున్న ఈ చిత్రంలో.. ఇంకా కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంబీ శ్రీరామ్, భరణి, కృష్ణ భఘవాన్, ఆలీ, వేణుమాధవ్, శివారెడ్డి, ఉత్తేజ్, హేమ, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.