11న ప్రేక్షకుల ముందుకు "దశావతార్"!
|
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మాట్లాడుతూ... భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్‌హాసన్ 10 విభిన్న పాత్రలు పోషించిన "దశావతారం" చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపారు. దశావతారం చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తూ ప్రేక్షకులు పెద్ద హిట్‌గా నిలిపారని రవిచంద్రన్ పేర్కొన్నారు.
నైజాం ప్రాంతంలో దశావతారం చిత్రం రెండు వారాలకు 3 కోట్ల 50 లక్షలకుపైగా షేర్ సాధించి సెన్సేషనల్ రికార్డు నమోదు చేసిందని సిరి మీడియా పీడీ ప్రసాద్ చెప్పారు. తమ ప్రాంతంలో దశావతారం రెండు వారాలకు 1 కోటి 60 లక్షలకుపైగా వసూళ్లు సాధించిందని సీడెడ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసిన శోభారాణి తెలిపారు. దశావతారం సీడెడ్‌లో పెద్ద హిట్‌గా నిలిచిందన్నారు. సినిమా మూడో వారంలోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోందని చెప్పారు.