ఆలోచింపచేసే ''మృగం''
|
ఈ చిత్రం 'చంద్రముఖి'లా రెండు రాష్ట్రాల్లోనూ విజయవంతం కావటంతో... ఇప్పుడీ మృగం చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లో నిర్మించిన కార్తిక్ జై మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్నో మార్పులు చేసి తెలుగులోనూ నిర్మించింది. తమిళ, మలయాళ పరిశ్రమల్లో విజయం సాధించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ రికార్డులు సృష్టిస్తుందని ఈ చిత్ర నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.
మలయాళంలో ప్రముఖ కథానాయికగా పేరుతెచ్చుకుని తమిళంలోనూ రాణించిన పద్మప్రియ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. టైటిల్ పాత్రలో 'ఆది' అనే యువ నటుడు, తన మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రామంలో అచ్చోసిన ఆబోతులా తిరుగుతూ ఎవరికీ లొంగకుండా కనిపించిన ప్రతి అమ్మాయినీ అనుభవిస్తూ తిరిగే మొరటు యువకుని పాత్రలో హీరో ఆది జీవించాడనే చెప్పాలి.
అదే సమయంలో ఎవరికీ భయపడకుండా మగరాయుడిలా పెరిగిన పద్మప్రియ ఆ మొరటు యువకుని ఎదిరించటంలోగాని అతనితో పోటీపడటంలోగానీ తనకు తానే సాటి అనే విధంగా సినిమా ఆద్యంతమూ అద్భుతంగా నటించి సినిమా సక్సెస్‌కు ఎంతో దోహదపడింది. పద్మప్రియ, ఆదిలతో తీసిన పడకగది దృశ్యాలు యువతను తన్మయత్వంతో ముంచడంతోపాటు క్లైమాక్స్ దృశ్యాలు ఆలోచనలో పడేస్తాయి.