1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పోస్ట్‌ ప్రొడక్షన్స్‌లో ''16 డేస్''

అరవింద్
WD PhotoWD
అరవింద్, ఛార్మి హీరో హీరోయిన్లుగా కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం '16 డేస్'. ఈ చిత్రానికి ప్రభుసోలోమాన్ దర్శకుడు. ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నెలాఖరులో తొలికాపీ సిద్ధమవుతోందనీ, వచ్చే నెలలో విడుదల చేస్తున్నామని నిర్మాతలు జెపి.కుమార్, డివై.చౌదరి వెల్లడించారు.

ఇందులో ఛార్మీ నటన హైలెట్‌గా నిలుస్తోందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ... 16 రోజుల హీరోహీరోయిన్లు కలిసి ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ నేపథ్యంలో జరిగే కథే ఈ చిత్రం. ఇందులోఛార్మీ లేడీ రజనీకాంత్‌లా చాలా హుషారుగా నటించింది. తమిళంలో రజనీకాంత్‌తో సహా పలువురి వాయిస్‌ను అనుకరించింది. అదేవిధంగా తెలుగులో పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం తదితరులు అనుకరిస్తోంది.

దీనికి కారణమేమిటి? అనేది చిత్రంలో చూడాల్సిందే. ఇందులో నాలుగు పాటలున్నాయి. యువతకు బాగా నచ్చుతాయని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం.. ధరణ్, ఎడిటింగ్.. జెఎన్.హర్ష, సినిమాటోగ్రఫి.. సుకుమార్, మాటలు.. నివాస్, నిర్మాతలు.. జేపి.కుమార్, డివై.చౌదరి, దర్శకుడు.. ప్రభుసోలోమాన్.
About Writer
PNR