సస్పెన్స్, కామెడీతో " హే రామా! ఏంటీ గోల"
|
అల్లూరి సీతారామరాజు కథచెప్పినప్పుడే కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఏర్పడిందని అన్నారు. లవ్ అంశాలున్నా పరిమితంగా ఉంటాయని, ముంబైకి చెందిన మనీషా సాంగ్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని దీపక్ రెడ్డి వెల్లడించారు. బాలాదిత్య చిత్రాల్లోనే భారీ బడ్జెట్ చిత్రమిదని, ఇప్పటివరకు పూర్తయిన 50శాతంలో టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ పూర్తయిందని చెప్పారు.
ఏకధాటిగా సింగిల్ షెడ్యూల్తో ఈ చిత్రం ఆగస్టులో పూర్తవుతుందని, సెప్టంబరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... రాజేష్ కె. కతూరి, సంగీతం... రాజ్‌కిరణ్, ఆర్ట్... రాజ్ కిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. రాజేంద్ర రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. శ్యామూల్.