ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"గోరింటాకు"పై రాజశేఖర దంపతుల వివరణ  Search similar articles
WD
"గోరింటాకు" చిత్రంలో వికలాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న సన్నివేశాలపై డాక్టర్. రాజశేఖర్, ఆయన సతీమణి, డైరక్టర్ జీవిత ఇరువురు వివరణ ఇచ్చారు. గోరింటాకులోని కుంటి, గుడ్డి వంటి పదజాలాన్ని సందర్భానుసారంగా మాత్రమే వాడామని అన్నారు.

వికలాంగుల మనోభావాలను దెబ్బతీయాలే ఉద్దేశంలో ఆ డైలాగ్‌లను పొందుపరచలేదని, యాదృశ్చికంగానే జరిగిపోయిందని చెప్పారు. ఈ డైలాగ్స్‌తో వికలాంగుల మనోభావాలు దెబ్బతీస్తాయని తాము ఊహించలేదని, అలా దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరారు. వికలాంగులను గౌరవపరిచే చిత్రాల్లో రాజశేఖర్ నటించారని జీవిత గుర్తు చేశారు. దీనికి రాజశేఖర్ నటించిన "శేషు" చిత్రమే నిదర్శనమని ఆమె ఎత్తిచూపారు.

"గోరింటాకు"లో వికలాంగులకు కించపరిచే దృశ్యాలున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు కృష్ణమాదిగ, వికలాంగుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావులు మంగళవారం ఆరోపించడమేగాకుండా, దర్శకుడు వికలాంగులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గోరింటాకు చిత్రంలో ఓ సన్నివేశంలో వచ్చిన కుంటి, గుడ్డి వంటి పదాలను తక్షణమే తొలగిస్తున్నట్లు చిత్ర దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని
సస్పెన్స్, కామెడీతో " హే రామా! ఏంటీ గోల"
"గోరింటాకు" చిత్ర దర్శకుడు క్షమాపణ!
అభ్యంతకర పదాలను తక్షణమే తొలగిస్తాం!
చిరంజీవిది వలసవాదుల పార్టీ! : యనమల
వై.వి.ఎస్ చౌదరి, విష్ణు కాంబినేషన్లో కొత్త చిత్రం
చివరి పాటలో "హరేరామ్"