1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రభాస్ సరసన నలుగురు హీరోయిన్లు!

ప్రభాస్ సరసన నలుగురు హీరోయిన్లు
WD PhotoWD
యూత్ హీరో ప్రభాస్ సరసన నలుగురు హీరోయిన్లు నటింబోతున్నారట.. కృష్ణంరాజు నిర్మాత సారథ్యం వహిస్తున్న కొత్త చిత్రంలో ప్రభాస్ నటించనున్నారు. గోపికృష్ణ మూవీస్ పతాకంపై, కృష్ణంరాజు కాంబినేషన్‌లో ప్రభాస్ నటించే తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నలుగురు హీరోయిన్లు నటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. గోపికృష్ణ పతాకంపై ఇప్పటికే మనఊరి పాండవులు, అమరదీపం, తాండ్ర పాపారాయుడు వంటి సినిమాలు విడుదలై హిట్టయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, హనుమాన్ జంక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎడిటర్ మోహన్ తనయుడు రాజా దర్శకత్వం వహించే కొత్త చిత్రంలోనూ ప్రభాస్ నటించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా, బుజ్జిగాడులో జతకట్టిన అందాల భామ త్రిష నటించబోతుందని సమాచారం.
About Writer
Selvi