"లోకనాయకుడు"గా రాజశేఖర్!
|
శివాని శివాత్మిక మూవీస్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్నారు. దక్షిణాదిన విడుదలై కలెక్షన్ల వెల్లువతో సంచలనం సృష్టిస్తున్న కమలహాసన్ దశావతారం చిత్రంలోని "లోకనాయకుడు" పేరిట మొదలయ్యే టైటిల్ సాంగ్ హిట్టయిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో, అదే టైటిల్‌తో రాజశేఖర్ నటించనున్న "లోకనాయకుడు" కూడా హిట్టవుతుందని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, రాజశేఖర్ సతీమణి దర్శకత్వంతో తెరకెక్కనున్న "సత్యమేవ జయతే" చిత్రంలో రాజశేఖర్ నటిస్తున్నారు.