సెల్యూలాయిడ్‌పై మరో "అంకుశం"
|
ఈ చిత్ర కథ విన్న ఎం. శ్యాంప్రసాద్ రెడ్డి "అంకుశం" అనే పేరు సరిపోతుందని సూచించడమే కాకుండా ఆ టైటిల్ తమ చిత్రానికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు దర్శక నిర్మాత వి. విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు.
చిత్రం గురించి ఆయన చెబుతూ... మార్చిలో షూటింగ్ ప్రారంభించామని, జూన్ నాటికి ఒకపాట మినహా సినిమా పూర్తయిందని, జూలై 10 నుంచి శబ్దాలయ థియేటర్‌లో డబ్బింగ్ ప్రారంభించామని చెప్పుకొచ్చారు.
ఈ నెలలోనే ఆడియోను, వచ్చేనెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు... సాహితి, సంగీతం.. మనోహర్, కెమెరా.. అమర్, ఎడిటింగ్.. ఎం. శంకర్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం.. వి. విజయ్‌కుమార్ రెడ్డి.