13న "భరతముని" అవార్డుల ప్రదానం
|
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ... "కళలను ప్రోత్సహించండి - మన సంస్కృతిని కాపాడండి" అంటూ కళామతల్లికి ఈ సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఫిలింఫేర్ అవార్డుల తర్వాత తనకు నచ్చిన అవార్డు భరతముని అవార్డేనని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ 21 ఏళ్ళపాటు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. అవార్డు దక్కిన చిత్రాల వివరాలను సంస్థ సలహాదారు కొండా నరేందర్ వివరించారు.
ఇక అవార్డుల వివరాలకెళితే... ఉత్తమ చిత్రంగా "మీశ్రేయోభిలాషి", ఉత్తమ నటుడు డా. జి. రాజేంద్రప్రసాద్, నటి ఛార్మిలు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా వేగం (జె.జె.రెడ్డి దర్శకనిర్మాత), ఉత్తమ హాస్య చిత్రం "సీమశాస్త్రి", ప్రారంభ హీరో హీరోయిన్‌లుగా " రామ్‌చరణ్, వైభవ్, గాయత్రి" (నోట్‌బుక్), క్యారెక్టర్ నటిగా ఝాన్సీ (సిరా), సపోరింట్ నటుడు నరేష్ (మీ శ్రేయోభిలాషి), నటిగా స్వాతి (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే)లకు భరతముని అవార్డులు లభించాయి.
అదేవిధంగా ఉత్తమ హాస్యనటుడు బ్రహ్మానందం (ఢీ), నటిగా కోవైసరళ (దేశముదురు), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్. డా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ( మీ శ్రేయోభిలాషి- చిరునవ్వులతో), గాయని ప్రణవి హ్యాపీడేస్ (యాకుందెండు.. శ్లోకం), సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్ (శంకర్‌దాదా జిందాబాద్), ప్రత్యేక కేటగిరిలో ఉత్తమ సంగీత దర్శకుడు వీణాపాణి (సిరా), సంభాషణల రచయిత రమేష్ చెప్పాల (మీ శ్రేయోభిలాషి), ఉత్తమ పబ్లిసిటీ డిజైనర్‌గా ధనియేలే (చందమామ-మీ శ్రేయోభిలాషి)లకు దక్కాయని ప్రకటించారు.