1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మెలోడీ ఆఫ్ మాన్సూన్

మెలోడీ ఆఫ్ మాన్సూన్
WD
భారత ప్రభుత్వ పిల్మ్స్ డివిజన్, పశ్చిమ బెంగాల్ ఫిలిం సెంటర్ అయిన నందన్ సంయుక్తంగా జూలై 11 న కోల్‌కతాలోని నందన్-2 లో జి.ఎల్ భరద్వాజ్, ఎస్ఎన్ఎస్ శాస్త్రి మరియు రమేష్ గుప్తాలు రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించాయి.

భావోద్వేగాలను పురికొల్పడంలో భారతీయ వర్షరుతువు వంటి మహత్తర సీజన్ బహుశా మరెక్కడా కనిపించదేమో.. భగభగమనిపించే వేడి, సుదీర్ఘ వేసవి పొడవునా దుమ్ముతో ముంచెత్తాక వర్షరుతువు మొదలవుతుంది. మండువేసవిలో చిరుజల్లులను మొదటగా పసికట్టే నెమలి రుతు ఆరంభానికి తొలి స్వాగతం పలుకుతుంది. చిరుజల్లుతో తడిసిన నేల వాసన గాలిలో మత్తుగా పయనించి ఉష్ణప్రతాపంతో వేగిపోయిన జనాలకు ఉపశమనం కల్గిస్తుంది.

బీటలు వారిన నేల వర్షపు చినుకులు తాకగానే పచ్చబడటం మొదలెట్టి త్వరలోనే భూమ్మీద పచ్చదనం ఆవరిస్తుంది. రుతుక్రమంలో సంభవించే తుపాను వెల్లువ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ ఉద్వేగం, అపరిమిత సంతోషం, సంతృప్తి, ఆత్రుత వంటి అన్ని భావావేశాలను మనుషుల్లో ప్రసారం చేయడం మాత్రమే కాదు.. బ్రతికేందుకు వర్షాలమీద ఆధారపడిన జనాలకు అంతిమ ఉపశమనం కల్గిస్తుంది. మరికొందరికేమో ఇది శృంగార రస రమ్యడోలికల్లో ఓలలాడేందుకు సరైన సమయం మరి.

భారతీయ సాంప్రదాయ సంగీతంలో అబ్బురమనిపించే అంశాల్లో ప్రకృతితో రాగాలు పెట్టుకునే సుసంపన్న సంబంధం ఒకటి. వర్ష రుతువు మూడ్స్‌ను భారతీయ సాంప్రదాయ సంగీతంలో అత్యద్భుత రీతిలో కనుగొనవచ్చు. వర్ష రుతువును గురించి హిందూస్తానీ సాంప్రదాయ సంగీతం చక్కటి స్వరకల్పనలతో కృతులు కూర్చింది. వీర రసం, కరుణ రసం, శృంగార రసం, విరహ రసం వంటి విస్తృత హావభావాలతో రాగాలు కూర్చింది.
WD


పలువురు సంప్రదాయ సంస్కృత కవులు వర్షాగమనం గురించి ప్రస్తుతిస్తూ పద్యాలు రాశాలు. భారత్‌లో వర్షరుతువు ప్రత్యేకత సంతరించుకుంది. రవీంద్రనాథ టాగూర్ వర్షాల గురించి అద్భుతమైన పాటలు రాశారు. భరద్వాజ్ తీసిన డాక్యుమెంటరీ చిత్రం మెలోడీ ఆఫ్ మాన్సూన్ రవీంద్ర కవీంద్రుడి కవితా భావావేశాన్ని మరోసారి మన మనోనేత్రం ముందు సాక్షాత్కరింప జేస్తుంది.

ఎస్ఎన్ఎల్ శాస్త్రి తీసిన రాగా-1 చిత్రం వర్షంకోసం వానదేవుడిని ప్రస్తుతిస్తూ ఉస్తాద్ అమీర్ ఖాన్ పాడిన మెఘమల్హార్ రాగంపై చిత్రీకరించింది. దెన్ ది రెయిన్స్ అనే పేరుతో రమేష్ గుప్తా తీసిన డాక్యుమెంటరీ చిత్రం వర్షరుతువు ఛాయాచిత్రాలను చిత్రీకరించింది. ఈ చిత్రం పూర్తిగా సంగీతం, దృశ్యాల ప్రాతిపదికన రూపొందించబడింది. ఈ చిత్రానికి 1969లో ఐర్లండ్‌లోని కోర్క్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు లభించగా, 1969లో ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది.

ఈ చిత్రాలను ప్రదర్శించే సమయం వివరాలు
600 p.m. మెలోడీ ఆఫ్ మాన్సూన్ - జిఎల్ భరద్వాజ్
645 p.m. రాగా-1 - ఎస్ఎన్ఎస్ శాస్త్రి
650 p.m. దెన్ ది రెయిన్స్ - రమేష్ గుప్తా
About Writer
Raju