గతంలో తరుణ్‌తో "ఒక ఊరిలో" చిత్రం ద్వారా దర్శకుడైన పబ్లిసిటీ డిజైనర్ రమేష్‌వర్మ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి "శ్రీశ్రీ" అనే పేరును కూడా రిజిస్టర్ చేయించారు. "శ్రీ"వల్లీ అనే అమ్మాయి, "శ్రీనివాస్" అనే అబ్బాయిల మధ్య సాగే ఓ అందమైన ప్రేమకథా చిత్రం కనుక "శ్రీశ్రీ" అనే పేరును ఖరారు చేసినట్లు రమేష్ వర్మ చెప్పారు.
శ్రీవల్లిగా జెనీలియాను ఎంపిచేశామని, ఇక ఆమె మనసును దోచుకునే శ్రీనివాస్ ఎవరనేది త్వరలో తెలియజేస్తామని అంటున్నారు. రామ్‌ను మొదట అనుకున్నా ఆయన ప్రస్తుతం ఎం.ఎస్.రాజు చిత్రంలో బిజీగా ఉండటం, ఆ తదుపరి మరో చిత్రంలో బుక్ కావడంతో మరో యువతరం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందే ఆయన "మల్లెపూవు" అనే కథను రెడీ చేసుకున్నారు. తన స్నేహితుడైన వి. సముద్రకు నచ్చడంతో ఆ కథను రమేష్ వర్మ ఇచ్చేశారు.
|