మళ్ళీ తెరపైకి మోహన్ బాబు-రమ్యకృష్ణ జంట!
|
‘ఆవకాయ బిర్యానీ’ అనే పేరుతో శేఖర్ కమ్ముల ఒక చిత్రాన్ని నిర్మించనున్నారని, ఇందులో కూడా కొత్త ప్రతిభను పరిచయం చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం ద్వారా అవినాష్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. అవినాష్ గతంలో కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. దీనితో శేఖర్ కమ్ముల తాజా ప్రాజెక్టు "ఆవకాయ బిర్యానీ" చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి శేఖర్ నిర్మాతగా మాత్రమే ఉండిపోయి దర్శకత్వ బాధ్యతలను అనీష్ కురువిల్లాకు అప్పగించడం విశేషం.