1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

హైదరాబాద్‌లో మల్లన్న!

హైదరాబాద్‌లో మల్లన్న
WD
విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా, అందాల ముద్దుగుమ్మ శ్రియ హీరోయిన్‌గా నటిస్తున్న "మల్లన్న" షూటింగ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతోంది. భాగ్యనగరంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అనంతరం, మల్లన్న యూనిట్ విదేశాలకు ప్రయాణం కానుంది.

తెలుగులో "మల్లన్న" పేరుతో తెరకెక్కన్ను ఈ సినిమా, తమిళంలో "కందసామి" పేరుతో రానుంది. తమిళంలో ప్రముఖ దర్శకుడు కళైపులి ధాను డైరక్షన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా గురించి చిత్ర దర్శకుడు వివరాలు తెలియజేస్తూ.. ఇటీవలే మల్లన్న ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడని చెప్పారు.

జూలై 23 నుంచి మెక్సికోలో "మల్లన్న" కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని చెప్పారు. ఫిల్మిం నగర్లోని రామోజీ ఫిలిం సిటీలో మల్లన్న షూటింగ్ ఓ వారం పాటు జరుగుతుందని ఆయన తెలిపారు. వి. క్రియేషన్స్ బేనర్‌పై ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.
About Writer
Selvi