1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సిలేరులో "దొంగలబండి" షూటింగ్!

సిలేరులో
WD
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న "దొంగలబండి" చిత్రం సిలేరు నదీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. సిలేరు నదీ, పొల్లూరు ప్రాంతంలోని వాటర్ ఫాల్స్ వద్ద, వైజాగ్- ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది.

ఆర్.ఎస్. నెట్‌వర్క్ పతాకంపై, ఆర్.ఎస్.నాయడు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. గతంలో కబడ్డీ- కబడ్డీ, కితకితలు చిత్రాల రచయిత విఘ్నేశ సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు.

సిలేరు ప్రాంతంలో ఈ నెల 24వ తేదీ వరకు "దొంగలబండి" షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇంకా ఈ సినిమాలో తన్యమలిష్కా, పూజాభారతి, వేణుమాధవ్, కోవై సరళ, ఎం.ఎస్. నారయణ, కొండవలస తదితరులు నటిస్తున్నారు. వినోద ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రం రికార్డింగ్ కార్యక్రమం ప్రారంభమైంది.
About Writer
Selvi