స్నేహ... ఫిఫ్టీ నాటౌట్
|
అయితే.. స్నేహ వెండితెరకు పరిచయం కాకమునుపు దర్శకుడు ఫాజిల్ దృష్టిలో పడింది. కానీ, మలయాళ దర్శకుడి చిత్రంలో నటించే తొలి అవకాశం వచ్చింది. ముంబైలో పుట్టిన ఈ తెలుగు బొమ్మ దుబాయ్‌లో పెరిగింది. తమిళంలో అబ్బాస్‌తో కలిసి నటించిన 'ఆనందం' చిత్రంతో కెరీర్‌ను మలుపుతిప్పింది.
అలా చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న స్నేహ అనతి తక్కువ కాలంలోనే అటు తమిళం, ఇటు తెలుగు చిత్రసీమల్లో అగ్రకథానాయికల జాబితాలో చోటు సంపాదించుకుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న స్నేహ, కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి, అజిత్, విజయ్, విక్రమ్, తెలుగులో వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రహీరోల సరసన నటించింది.
ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా నిర్మితమవుతున్న కొత్త చిత్రం 'వందేమాతరం' అనే మలయాళ చిత్రంలోను, ప్రసన్న హీరోగా నటిస్తున్న 'అచ్చముండు అచ్చముండు' అనే తమిళ సినిమాలోనూ నటిస్తోంది. ఇలా అన్ని భాషల్లో కలుపుకొని 49 చిత్రాలను పూర్తి చేశారు.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం 'కథానాయకుడు' (తమిళంలో 'కుసేలన్') చిత్రం స్నేహకు యాభైవ చిత్రం. ఈ శుభసందర్భంగా స్నేహ మాట్లాడుతూ.. మలయాళంలో మోహన్ లాల్ సరసన, శంకర్, మణిరత్న దర్శకత్వాల్లో నటించాలని ఆశ ఉన్నట్టు చెప్పారు.