ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అజ్లేషాతో గోపిక నిశ్చితార్థం!  Search similar articles
WD
నా ఆటోగ్రాఫ్, యువసేన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గోపిక పెళ్లి కూతురైంది. ఐర్లాండులో ఉంటున్న భారతీయ డాక్టర్ అజ్లేషాతో గోపిక నిశ్చితార్థం వైభవంగా జరిగింది. త్రిశూర్‌లోని జాయ్స్‌ ప్యాలెస్ ఫైవ్‌స్టార్ హోటళ్లో బంధువర్గం, సినీ తారలు, స్నేహితుల సమక్షంలో గోపిక నిశ్చితార్థం జరిగింది.

మహిళలకు సౌభాగ్యానికి అద్దం పట్టే ఎరుపు, పసుపు రంగులతో మిళితమైన గాగ్రా చోళీని ధరించి దేవకన్యలా దర్శనమిచ్చిన గోపికకు అజ్లేష్ డైమండ్ రింగ్ తొడిగారు. అనంతరం అజ్లేష్‌కు రింగ్ తొడిగిన గోపికకు అప్పుడే పెళ్ళి కళ ఉట్టిపడింది.

ఈ నిశ్చితార్థ వైభవంలో నటి భావన, బిజు మేనన్, సంవిర్త, రమ్య నంబీసన్, సంయుక్త వంటి తదితర సినీ తారలు హాజరయ్యారు. ఈ నెల 17వ తేదీన ఎర్నాకులంలోని సెయింట్ థామస్ చర్చిలో గోపిక-అజ్లేష్ వివాహం ఘనంగా జరుగనుంది. ఈ నెల 20వ తేదీన అవెన్యూ సెంటర్లో రిసెప్షన్ పార్టీ జరుగనుంది.

ఇదిలా ఉండగా, తెలుగు, తమిళ, మళయాళ , కన్నడ భాషల్లో దాదాపు 35 చిత్రాల్లో నటించిన గోపిక వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. 'ఆటోగ్రాఫ్' చిత్రం ద్వారా తమిళతెరకు పరిచయమైన కేరళ కుట్టి గోపిక.. అదే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.
మరిన్ని
స్నేహ... ఫిఫ్టీ నాటౌట్
మలేషియాలో శ్రీకాంత్-ఛార్మీ!
హైదరాబాద్‌లో "కాశీపట్నం చూడర బాబూ..
నవ్వే దమ్ముందా? అంటున్న "సిటీలైఫ్"
శరవేగంగా తరుణ్-జెనీలియా కొత్త చిత్రం
సిలేరులో "దొంగలబండి" షూటింగ్!