రవితేజ, అనుష్క జంటగా నటిస్తోన్న చిత్రానికి "బలాదూర్" (వీడికి బాధ్యతలెక్కువ) అనే టైటిల్ ఖరారైంది. రవితేజ శైలిలో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ అంశాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం కుటుంబకథానేపథ్యంలో సాగుతోందని చిత్ర నిర్మాత డి. సురేష్‌బాబు వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తికావచ్చిన సందర్భంగా బుధవారం రామానాయుడు స్టూడియోలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ముందుగా ఈ చిత్రానికి రవితేజకు తగినట్లుగా టైటిల్‌కు పెడతామనుకున్నామని, కానీ కథాపరంగా పెట్టాలని రవితేజ సూచించడంతో "ఇంటికొక్కడు" అనుకున్నా... దానికంటే "బలాదూర్" కరెక్ట్‌గా సరిపోతుందని ఈ పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. బలాదూర్‌గా తిరిగే వ్యక్తికి బాధ్యతలు ఏమిటి? అనేది చిత్రంలోని ఆసక్తికర అంశమని, ఇందులో రవితేజ పెద్దనాన్నగా కృష్ణ నటిస్తున్నారని తెలిపారు.
|