21న "బ్లేడ్‌బాబ్జీ" ఆడియో విడుదల
|
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. దొంగతనాన్ని వృత్తిగా పెట్టుకున్న ఓ యువకుడు పోలీసుగా మారితే ఎలా ఉంటుందన్న అంశాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించామని అన్నారు. ఇందులో నెగటివ్ పాత్రలు లేవని, ప్రతిపాత్ర ప్రవర్తన ప్రేక్షకులకు చక్కట హాస్యాన్ని అందిస్తుందని చెప్పారు.
కోటీ అందించిన సంగీతం వీనులవిందుగా ఉంటుందని, రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరించామని అన్నారు. నిర్మాత సత్యకుమార్ మాట్లాడుతూ.. రీరికార్డింగ్ పాటు మరోవైపు డీటీఎస్ మిక్సింగ్ కూడా జరుగుతోందని, ఆగస్టు మొదటివారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దేవీ ప్రసాద్ తెలిపారు.