1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"గీతం" ఆల్బమ్ విడుదల

"
WD
సత్యం" చిత్రంలో "ఐయామ్ ఇన్ లవ్.." అంటూ గీతాన్ని ఆలపించిన వర్థమాన గాయకుడు రఘురాం "గీతం" అనే ఆల్బమ్‌ను విడుదల చేశారు. రఘురాం రూపొందించిన ఈ ఆల్బమ్, ఆదిత్యమ్యూజిక్ మార్కెట్ చేస్తోంది. ఈ ఆల్బమ్ సీడీని బుధవారం ఫిలింఛాంబర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి కీరవాణి ఆవిష్కరించారు.

ఆడియోను మరో సంగీత దర్శకుడు చక్రి విడుదల చేశారు. ఔత్సాహికుల్లో పరవళ్లుతొక్కే ఉత్సాహముంటుందని, ఆ తపనతో రఘురాం చేసిన ఆడియో మంచి విజయాన్ని చవిచూడాలని కీరవాణి అభిలాషించారు. చక్రిమాట్లాడుతూ.. "సత్యం"లో "ఐయామ్ ఇన్‌లవ్.." అనే పాటతో రఘురాం పరిచయమయ్యాడని, ఆ తర్వాత తన ప్రతిభను మెరుగుదిద్దుకుంటూ ఆల్బమ్ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.

తెలుగులో ఆల్బమ్ అంటేనే ఓ అపప్రద ఉందని, మిగిలిన చోట్ల ఇదొక క్వాలిఫికేషన్‌గా ఉంటూ ప్రతిభకు చిహ్నంగా ఉంటుందని చెప్పారు. ఆ దిశగా వర్ధమాన గాయనీగాయకులు కృషి చేయాలని సూచించారు. ఇందులో ఏడు పాటలుంటాయనీ, లవ్ కాన్పెప్ట్‌తో అన్నీ ఎమోషన్స్ వచ్చే విధంగా ఆలపించాయనీ, అందర్నీ అలరించేట్లుగా ఉంటాయనే ఆశాభావాన్ని రఘురాం వ్యక్తం చేశారు. ఈ ఆల్బమ్‌కు అవినాష్, విశ్వనాథ్ సాహిత్యం సమకూర్చగా వెంకట్ స్వరాలు సమకూర్చారు.
About Writer
Selvi