1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన గోపిక!

వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన గోపిక!
WD
"నా ఆటోగ్రాఫ్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మలయాళ ముద్దుగుమ్మ గోపిక వైవాహిక జీవితంలోకి అడుగెట్టింది. గురువారం గోపిక సొంత ఊరైన త్రిశూర్‌లో లండన్ డాక్టర్ అజ్లేష్‌తో ఆమె పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించేది లేదని నిర్ణయించుకున్న గోపిక తన భర్తతో ఐర్లాండ్‌లో స్థిరపడనుంది.

తమిళంలో ప్రముఖ దర్శకుడు, నటుడు రూపొందించిన చేరన్ "ఆటోగ్రాఫ్‌" ద్వారా కోలీవుడ్‌కు పరిచమైన అందాల భామ గోపిక, తెలుగులో యువసేన వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

దక్షిణాది భాషా చిత్రాలన్నింటిలోనూ నటించిన గోపిక తెలుగులో ఇటీవల రిషి, సామ్రాట్ సరసన ’వీడు మామూలోడు కాదు’ సినిమాలో నటించింది. అయితే ఆమెకు రవితేజ సరసన ’నా ఆటోగ్రాఫ్’ సినిమాలో కేరళ అమ్మాయిగా నటించిన పాత్ర బాగా పేరు తెచ్చి, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 35 చిత్రాల్లో గోపిక నటించింది.
About Writer
Selvi