టాలీవుడ్ పరిశ్రమకు సెన్సార్ నిబంధనల వాత
తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకునేటట్లు కనిపిస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో విడుదలైన సినిమాలలోని కొన్ని సన్నివేశాలు కొన్ని వర్గాలకు చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వున్నాయంటూ ఆందోళనలు, కేసులు జరిగాయి. ఫలితంగా సదరు చిత్రాలకు చెందిన నిర్మాత, దర్శకులు క్షమాపణలు చెప్పుకున్నారు.
ఈ పరిస్థితులన్నిటినీ గమనించిన సెన్సార్ బృందం తాజాగా ఓ నియమ నిబంధనల జాబితాను నిర్మాతల మండలికి పంపింది. దీనిప్రకారం...
ఏ ఒక్క వర్గాన్ని కించపరిచే విధంగా చిత్రీకరణ జరుపరాదు.
ప్రత్యేకించి ఓ కులాన్ని, మతాన్ని కించపరిచేటటువంటి సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పాటించాలి.
శారీరక వైకల్యం వున్నవారిని కించపరిచే సన్నివేశ చిత్రీకరణ జరుపరాదు.
కులమత ప్రాతిపదికన సినీ పాత్రల రూపకల్పన చేపట్టకూడదు.
బ్యాక్‌డ్రాప్‌లో జంతువులను పెట్టకూడదు...వంటి తదితర నియమనిబంధనలను పొందుపరిచారు.
సెన్సార్ నిబంధనల నేపధ్యంలో నిర్మాతమండలి అత్యవసర సమావేశం ఏర్పాటయింది. ఈ సమావేశంలో సెన్సార్ నియమనిబంధనలను పరిశీలించారు. కించపరిచే సన్నివేశాల విషయం మాట అటుంచి వినోదాన్ని పండించగల కొన్ని అంశాలను సైతం నిబంధనల్లో చేర్చారని కొందరు నిర్మాతలు వాపోతున్నారు.
ఈ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ సినిమా తీస్తే... అది వినోదాన్ని పంచటం కల్ల అని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సెన్సార్ నిబంధనల వేటుతో చిత్ర నిర్మాణాలు గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారి భవిష్య పరిస్థితి కాస్తంత ఆందోళనకరమే.