రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బేనర్‌పై 'మధుర' ఆడియో అధినేత శ్రీధర్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, లార్స్‌కో ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో లగడపాటి శ్రీధర్ త్వరలో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ చిత్రానికి 'స్నేహగీతం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా లగపాటి శ్రీధర్ మాట్లాడుతూ... సరికొత్త కథాంశంతో యూత్‌ఫుల్ లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రముంటుందన్నారు. న్యూటాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతోనే స్టార్‌హంట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
నటనపై ఆసక్తి కలిగి, సినీరంగంలో రాణించాలనుకునే తపన కలిగిన ఉత్సాహవంతులైన యువతీయువకులు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చునన్నారు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవారు గతంలో ఏ చిత్రంలోనూ నటించి ఉండకూడదని. 18 నుంచి 25 సంవత్సరాల వయుస్సు కల్గినవారు అర్హులు అని చెప్పారు.
చిత్ర దర్శకుడు 'మధుర' ఆడియో ఆధినేత శ్రీధర్ మాట్లాడుతూ... రామ్‌గోపాల్‌వర్మ, మణిరత్నం చిత్రాలను చూసి పెరిగానని, క్రిష్, శేఖర్‌కమ్ముల చిత్రాలు నన్ను ఇన్‌స్పైర్ చేశాయన్నారు. వారి చిత్రాల్లో నిజాయితీ కనబడిందని, అదే నన్ను దర్శకునిగా మార్చిందని చెప్పారు.
తనను నమ్మి సీనియర్ టెక్నీషియన్ టీమ్‌ను అందించిన శ్రీధర్‌కోసం, టీమ్ కోసం కష్టపడతానని, ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాలను తీసేందుకు మార్గం మవుతుందని శ్రీధర్ వెల్లడించారు. దర్శకుడు నీలకంఠ, రాధాకృష్ణ ఆధ్వర్వంలో టాలెంట్ హంట్ కార్యక్రమం జరగనున్నదని తెలిపారు. వారు ఎంపిక చేసిన నటీనటుల్ని చిత్రంలో పరిచయం చేస్తామన్నారు. అనుకున్నట్లు అందరూ లభిస్తే ఆగస్టు 21 నుంచే షుటింగ్ ప్రారంభిస్తామన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్... పిజె జిందా(గ్రహణం), ఎడిటర్... అనిరుధ్(హిందీ 'సర్కార్'), ఆర్ట్... మధురెప్ప(డేంజర్, దర్కాజ), సంగీతం...సునీల్ కాశ్యప్, మాటలు... తిరుమల కిషోర్
|