విడుదలకు సిద్ధమౌతోన్న ముమైత్ "టార్గెట్"
|
మిస్టరీతో నడిచే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మనస్సులో దాగి ఉన్న టార్గెట్ ప్రకారమే కథ నడుస్తుందని రాజా వివరించారు. టార్గెట్ షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఆడియోను ఈ నెలాఖరు కల్లా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, సినిమాను ఆగస్టు నెల రెండో వారంలో రిలీజ్ చేస్తామని రమేష్ రాజా చెప్పారు.
శివబాలజీ, ముమైత్‌ఖాన్ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సిరిసాయి సూర్యమూవీస్ బేనర్‌పై సంగిశెట్టి దశరథ, బి. రామకృష్ణ నిర్మిస్తున్నారు. కోటి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఇంకా శ్రద్ధాదాస్, విశ్వజిత్, అలీ, వేణుమాధవ్, ఆహుతీ ప్రసాద్, కొండవలస, అభినయశ్రీ, మందాకిని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు- వెలిగొండ శ్రీనివాస్, కెమెరా- వి.ఎన్. సురేష్‌కుమార్.