1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చివరి దశలో "వినాయకుడు"

అంతిమ దశలో
WD
కృష్ణుడు, సోనియా హీరోహీరోయిన్లుగా, ప్రేమ్ మూవీస్ పతాకంపై రూపొందుకుంటున్న చిత్రం "వినాయకుడు". ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉందని చిత్ర దర్శకుడు సాకిరన్ వెల్లడించారు. ఎక్కువ సన్నివేశాల్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రించామనీ, కథాపరంగా పాత్రలను ఎంపిక చేసామని సాకిరన్ చెప్పారు.

"హ్యాపీడేస్" చిత్రం ద్వరా సోనియాకు ఇటీవలే ఫిలింఫేర్ అవార్డు రావడం అభినందించదగిందనీ, తమ చిత్రం షూటింగ్ దశలోనే ఆమెకు రావడం తమకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

ప్రస్తుతం "వినాయకుడు" చిత్రం 90శాతం పూర్తయిందని, ఈ నెలాఖరులో షూటింగ్ ముగించుకుని ఆగస్టు నెలలో ఆడియోను విడుదల చేస్తామనీ, సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదలచేయనున్నామని తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... పి.జె. విధా, సంగీతం... ప్రశాంత్, నిర్మాత... సరితాపట్రా, కథ, మాటలు, స్క్రిన్‌ప్లే, దర్శకత్వం... సాయికిరణ్.
About Writer
Harsha Vardhan