1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అల్లు అరవింద్ చేతులమీదుగా "బాబ్జీ" ఆడియో

వెండి తెర కథనాలు అల్లు అరవింద్ చేతులమీదుగా బ్లేడ్ బాబ్జీ ఆడియో ఆవిష్కరణ
WD
అల్లరి నరేష్ కధానాయకుడుగా నటిస్తోన్న "బ్లేడ్ బాబ్జీ" చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథి అల్లు అరవింద్ విచ్చేసి ఆడియో సీడీని ఆవిష్కరించి కోడిరామకృష్ణకు అందించారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ... ఈ ఆడియో ఆవిష్కరణకు తాను రావడానికి ప్రత్యేక కారణం ఉందన్నారు. ఈ చిత్రానికి సీనియర్ నిర్మాత జయకృష్ణ కుమారుడు ముద్దుకృష్ణ నిర్మతగా ఉండాల్సిందన్నారు. ఆయన ఇక్కడ లేకపోవడం దురదృష్టకరమన్నారు.

కాగా.. ఈ తరుణంలో వారి అల్లుడు ముత్యాల సత్యకుమార్ ఈ చిత్రానికి నిర్మాత సారధ్యం వహిస్తున్నందునే వచ్చానన్నారు. పోతే సినిమా గురించి చెప్పాలంటే... అల్లరి నరేష్ నటించిన చిత్రాలను చూడాలంటే తమకు ఉత్సాహం వేస్తుందన్నారు. "గమ్యం" చిత్రంలో చక్కని పెర్‌ఫార్మెన్స్ చేశారని, దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తే మరింత విజయం వచ్చిఉండేదని ఆయన వెల్లడించారు. తన కుటుంబమంతా నరేష్ నటించిన చిత్రాలు ఎంతో ఆసక్తిగా చూస్తారన్నారు. నరేష్ భవిష్యత్‌లో మరింతగా ఎదగాలని ఆశిస్తున్నాట్లు వెల్లడించారు.

కోడిరామకృష్ణ స్పందిస్తూ... సినిమా విజయానికి టైటిల్ చాలా దోహదం చేస్తుందన్నారు. ఈ చిత్రానికి తగిన టైటిల్ హీరో నరేష్, మనకు హీరోలు, విలన్‌లు కొరత ఏదోరకంగా తీరుతుందన్నారు. కానీ కామెడీ పాత్రలు, సెంటిమెంటు పాత్రలును పోషించే చలం కొరత చాలా కాలం భర్తీకాలేదన్నారు. ఇప్పుడు ఆ కొరత నరేష్‌తో పూర్తయిందని, సీమశాస్త్రిలో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ నరేష్ చక్కగా పోషించాడన్నారు.

ఇకపోతే దేవీప్రసాద్ తమ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడని, ఆయనలో ఆర్టీస్టు కూడా దాగివున్నాడన్నారు. ఈ చిత్రానికి కోటి చక్కని సంగీతాన్ని అందించాడని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందన్నారు. రాజేంద్రప్రసాద్ తరహా పాత్రల్ని నరేష్ పోషించి ఉంటాడని ఎస్. వి. కృష్ణరెడ్డి అభిప్రాయపడ్డారు.

WD
ఇ.వి.వి మాట్లాడుతూ... నరేష్ నటించిన చిత్రాలకు కథలు వినడం మానేశానని, ఇప్పటి ట్రెండ్‌కు తమ ఆలోచనలు కరెక్టుగా ఉంటాయేలేదోన్న భయం ఉందన్నారు. ఈ కథమాత్రం తమను వినమని రచయిత సతీష్ చెప్పడన్నారు. విన్నతర్వాత కథ అద్భుతంగా ఉందని, అప్పటికే నిర్మాత బుక్ అయ్యాడని, లేకుంటే తామే చేద్దామనుకున్నామన్నారు.

లీలామహల్ సెంటర్‌లో దేవీ ప్రసాద్ బ్రంహ్మాండంగా తీసాడన్నారు. చిత్రంలో హాస్యాన్ని చక్కగా చూపాడన్నారు. తమ కన్నా ఈ చిత్రంలో హాస్యాన్ని చక్కగా చూపాడని అనుకుంటున్నాన్నారు.

అచ్చిరెడ్డి మాట్లాడుతూ... నరేష్ చూస్తుంటే ఆప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 10 చిత్రాలు తీస్తూ నిర్మాతల హీరోగా నిలిచాడని, ఆలాగే పిల్లల్లోకూడా నరేష్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడన్నారు. మరింత భవిష్యత్ఉందన్నారు.

చిత్ర దర్శకుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ..... తమ గురువు కోడిరామకృష్ణగారు లేకపోతే తాము ఈ స్థానంలోకి వచ్చేవాడిని కాదన్నారు. ఇ.వి.వి గారు తమకు సక్సెస్ లేకపోయినా చిత్రాన్నిఇచ్చి ప్రోత్సహించారన్నారు. మంచి ఎంటర్‌టైనర్ చిత్రమిదన్నారు.

నటుడు నరేష్ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రారంభంకావడానికి ప్రధాన కర్త తమ స్నేహితుడు ముద్దుకృష్ణని, ఆయనే నిర్మాతగా ఉండాల్సిందన్నారు. కానీ అంకితం పేరు వేసుకోవడం కాస్త మనస్సును కలచివేసిందని, ఉద్వేగానికి లోనయ్యానని తెలిపారు. చిత్రం రష్ చూసి సూపర్ హిట్ అని ముద్దుకృష్ణ అన్నట్లే సక్సెస్ కానుందన్నారు. ఈ సందర్భంలో దేవీ శ్రీ ప్రసాద్‌తో డిసెంబర్‌లో మరోచిత్రంలో నటించనున్నారన్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు ప్రథమార్థంలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
About Writer
Harsha Vardhan