1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రభాస్ చిత్రానికి జయంత్ దర్శకత్వం!

వెండితెర కథనాలు ప్రభాస్ చిత్రం జయంత్ దర్శకత్వం గోపికృష్ణ మూవీస్
WD
యువ హీరో ప్రభాస్ నటించే "రాజు" అనే కొత్త చిత్రానికి జయంత్ పరంజి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణం రాజు నిర్మాత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా, ఆయన సొంత బేనర్ అయిన గోపికృష్ణ మూవీస్‌పై రూపుదిద్దుకోనుంది. తెలుగు వెండితెరకు కృష్ణవేణి, భక్తకన్నప్ప వంటి హిట్ సినిమాలను కృష్ణంరాజు అందించారు.

అదేవిధంగా అల్లరిపిడుగు, జయంత్, గత ఏడాది నవంబరులో రిలీజ్ అయిన "లవ్ ఫర్ ఎవర్" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న’బుజ్జిగాడు…మేడిన్ చెన్నై’ సినిమా.. యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు పూరీజగన్నాథ్ దర్శకత్వం వహించగా, కె.ఎస్. రామారావు నిర్మాత సారథ్యం వహించారు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష నటించింది. ఇంకా చిత్రంలో మోహన్‌బాబు, కోటశ్రీనివాసరావు, సునీల్, జయప్రకాష్‌రెడ్డి, అలీ, ఎమ్మెస్ నారాయణ, అజయ్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, హేమ, సుధ తదితరులు నటించారు.
About Writer
Selvi