1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"ఫిట్టింగ్ మాస్టర్" షూటింగ్ ప్రారంభం

వెండితెర కథనాలు
WD
"అల్లరి నరేష్" హీరోగా "ఫిట్టింగ్ మాస్టర్" అనే కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇ.వి.వి. సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ముంబై మోడల్ మదలసా హీరోయిన్‌గా నటిస్తోంది.

పూర్తి వినోద భరితంగా సాగే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం సింగిల్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

డిసెంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా ద్వారా కొత్త హాస్యనటులను తెలుగు వెండితెరకు ఇ.వి.వి పరిచయం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి చిన్నా సంగీతం సమకూర్చారు.
About Writer
Selvi