ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాగేంద్రబాబు హీరోగా "ఏక్‌పోలీస్" పూర్తి  Search similar articles
WD
కోడిరామకృష్ణ దర్శకత్వంలో నాగేంద్రబాబు పోలీస్ అధికారిగా నటించిన "ఏక్‌పోలిస్‌"గా చిత్రం షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. ప్రస్తుతం మాదాపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సన్నివేశాల చిత్రికరణ జరుగుతోంది. నాగబాబు, సత్య ప్రకాష్, కృషి తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు.

కోడిరామకృష్ణ మాట్లాడుతూ... తమ చిత్రాలంటేనే ప్రేక్షకుల్లో ఓ అంచనా ఉందనీ, వాటికనుగూణంగానే చిత్ర రూపకల్పన జరిగిందని కోడిరామకృష్ణ అన్నారు. కథకు అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ రీత్యా నాగబాబు పాత్ర సరిపోతారనే భావించి నిర్మాత భాస్కరరెడ్డి గారికి చెప్పడం, అందుకు ఆయన అంగీకరించడం జరిగిందన్నారు.

రౌడీయిజం, హాస్యం మేళవించిన పాత్రలను గతంలో నాగభూషణం, రావుగోపాల రావు, అంజాద్ ఖాన్ వంటివారు ఎందరో పోషించారనీ, ఈ చిత్రంలో అలాంటి పాత్రను సత్య ప్రకాష్ తనదైన శైలిలో వైవిధ్యంగా పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీరితోపాటు నలుగురు యువత కథ కూడా అంతర్లీనంగా సాగుతుందనీ, సమాజంలోని సమస్యలకు యువత ప్రాధాన్యత ఏమిటనేది.. వారి పాత్రల్లో చెప్పడం జరిగిందని వివరించారు. ప్రత్యేకించి డ్యూయెట్ సాంగ్‌లులేవనీ, కథను నడిపించే ఐదు పాటలకు కోటి సంగీతం సమకూర్చారని కోడిరామకృష్ణ తెలిపారు.

నిర్మాత ఎన్.హెచ్. భాస్కరరెడ్డి మాట్లాడుతూ... వాస్తవానికి దగ్గరగా రూపొందుతున్న చిత్రమని, తొలిసారిగా మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నాననే నమ్మకం తమకుందన్నారు.

నాగేంద్రబాబు మాట్లాడుతూ... పోలీస్ పాత్రను మలచడంలో కోడిరామకృష్ణ అందెవేసిన చేయి. సమాజంలో చెడును చెడుతోనే నిర్మూలించి మంచిని వెలికితీయాలనే పాయింట్‌తో ఈ చిత్రం కేంద్రీకృతమైందన్నారు. అందులో నాపాత్ర ఒక భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు.

సత్యప్రకాష్ మాట్లాడుతూ.... నాగేంద్రబాబుకు వ్యతిరేకపాత్ర తనదనీ, ఇందులో తనకొక పాటకూడా ఉందనీ, పాత్రతీరును కోడిరామకృష్ణ అద్భుతంగా తెరకెక్కించారన్నారు. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ... పొట్టివాడినైన తమతో తొలిసారిగా పోలీస్ పాత్రను వేయించిన ఘనత కోడిరామకృష్ణగారికే చెందుతుందన్నారు.

ఇంకా ఈ చిత్రంలో అలీ, గాయత్రి, సామ్రాట్, భూషణ్, సూర్యచరణ్, ధీరజ్, పృధ్వీ, డాక్టర్. శివప్రసాద్, కోటి తదితరులు నటిస్తున్నారు. కథ సహకారం... వల్లభనేని జనార్థన్, మాటలు... స్వామీజీ విజయ్, ఎడిటర్... నందమూరిహరి, ఆర్ట్... జెపి, కెమెరా...వి శ్రీనివాసరెడ్డి, సహనిర్మాతలు... ఎన్.హెచ్. ప్రసాద్‌రెడ్డి, శరభరెడ్డి, నిర్మాతలు... భాస్కరరెడ్డి, కృష్ణప్రసాద్.
మరిన్ని
"ఫిట్టింగ్ మాస్టర్" షూటింగ్ ప్రారంభం
గోవాలో 'ఖండాంతర' చిత్రోత్సవం
టాకీ పూర్తి చేసుకున్న "కాశీపట్నం..."
ప్రభాస్ చిత్రానికి జయంత్ దర్శకత్వం!
"లేచిపోదామా" అంటున్న సంగీత సోదరుడు
సింహాచలంలో "చింతకాయల రవి"