1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాధ్యత తెలిసిన ప్రేమజంటతో "లేచిపోదామా.."!

వెండితెర కథనాలు బాధ్యత తెలిసిన ప్రేమజంట లేచిపోదామా తల్లిదండ్రులు
WD
శ్రీవారు ఫిలింస్ బేనర్‌పై రూపొందుతున్న కొత్త చిత్రం "లేచిపోదామా". పిల్లలు ప్రేమించిన వారితో లేచిపోతే తల్లిదండ్రులు ఎంతో బాధపడుతారు. అయితే ఈ చిత్రంలో మాత్రం సంతోషంగా ఫీలవుతారని, అందుకు సరైన కారణం ఉందని, అదే ఈ చిత్రానికి హైలెట్‌‌గా నిలుస్తుందని చిత్ర దర్శకుడు కన్మణి అంటున్నారు. వి.భరణి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ "సంగీత" సోదరుడు "పరిమళ్" కథానాయకుడుగా పరిచయమవుతున్నాడు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... ఈ సినిమా షూటింగ్ ఈ నెల 14 నుంచి చెన్నైలో ప్రారంభంకానుందన్నారు. "ప్రేమిస్తే" ఫేం "సంధ్య" హీరోయిన్ పాత్రలో నటిస్తోందని, హైదరాబాద్, చెన్నై, ఊటీ తదితర ప్రదేశాలలో షూటింగ్ చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటలను విదేశాల్లో చిత్రిస్తామన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... బాధ్యత తెలిసిన ప్రేమజంట కథానేపథ్యంతో ఈ సినిమా రూపొందనుందని, ఇది ఆకతాయి ప్రేమ కాదని, అనుభూతితో కూడుకున్న ప్రేమకథ అని చెప్పారు. ఈ సినిమాలో మంచి ఫీల్ ఉందన్నారు.

ఇకపోతే ఈ సినిమాకి మాటలు... సంపత్ నంది, సంగీతం... డి. ఇమాన్, కెమెరా... అంజి, ఎడిటింగ్... సురెష్ అర్స్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం...కన్మణి.
About Writer
Harsha Vardhan