1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

టోక్యో ఫిలిం ఫెస్టివల్‌కు రజనీ కాంత్!

వెండితెర కథనాలు టోక్యో ఫిలిం ఫెస్టివల్‌ రజనీ కాంత్ జపాన్‌ అక్టోబర్‌ కథానాయకుడు హీరో
జపాన్‌లో అక్టోబర్‌లో జరుగనున్న టోక్యో ఫిలిం ఫెస్టివల్‌కు "కథానాయకుడు" హీరో రజనీ కాంత్ హాజరుకానున్నారు. సినీ షెడ్యూళ్లతో బిజీబిజీ ఉంటున్న రజనీ తొలిసారిగా టోక్యో ఫిలిం ఫెస్టివల్‌కు తొలిసారిగా హాజరు కానున్నారు. ఈ ఫెస్టివల్‌లో తాను కచ్చితంగా హాజరు కానున్నట్లు ఇప్పటికే ఆయన ఖరారు చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో పర్యటించిన రజనీ కాంత్ ఇంకా సూర్యుడుపైనే కాలుమోపలేదు.

తమిళసూపర్ స్టార్ రజనీ కాంత్ నటించే ప్రతి సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో, ఆగ్నేయాసియా, తూర్పు చైనా వంటి దేశాల్లో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. దాదాపు 1000కి మించిన క్లబ్‌లను రజనీ అభిమానులు ఆయన పేరుతోనే నడుపుతున్నారు.

అంతేకాకుండా రజనీ నటించే సినిమాలను జపాన్, చైనాలకు చెందిన అభిమానులకు అనుగుణంగా వారి భాషల్లోనే అనువదించి డీవీడీ షాపుల్లో డిస్‌ప్లే చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే.. జపానీయులు రజనీ కాంత్‌ను "నృత్యానికి సామ్రాజ్యాధిపతి"గా అభివర్ణిస్తున్నారట. ఇకపోతే తమిళంలో తాజాగా విడుదలవుతున్న "కుచేలన్" (తెలుగులో కథానాయకుడు) టోక్యో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడనుంది.
About Writer
Selvi