"మర్మయోగి" అవతారంలో కమల్ హాసన్!
|
ఏడవ శతాబ్దానికి చెందిన కొన్ని చారిత్రక ఆధారాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని కమల్ తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారని చెప్పారు. భారత సినీ చరిత్రలో "మర్మయోగి" సినిమా మైలురాయిగా నిలుస్తుందని కమల్ హాసన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
"దశావతారం" సినిమాకు లభించిన ప్రేక్షకుల భారీ స్పందనతోనే "మర్మయోగి" చిత్రీకరణకు పూనుకుంటున్నామని కమల్ వెల్లడించారు. "దశావతారం" హిట్‌కు కారణమైన సినీ యూనిట్‌కు, ప్రేక్షకులకు కమల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఇదిలా ఉండగా, కమల్ హాసన్ నటించిన "దశావతారం" దక్షిణాదిన పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్‌లోనూ "దశావతార్"గా రూపుదిద్దుకుంటోంది.