1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రమేష్‌వర్మ తదుపరి సినిమా "గాలిపటం"

వినోదం వెండితెర కథనాలు తరుణ్ హీరో ఒక ఊరి గాలిపటం
WD
తరుణ్ హీరోగా నటిస్తున్న "ఒక ఊరిలో" సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న రమేష్ వర్మ "గాలిపటం" పేరిట కొత్త సినిమాను రూపొందించనున్నారు. కన్నడంలోని "గాలిపట" మాతృకను ఆధారంగా తీసుకుని నూతన తారాగణంతో తెరకెక్కించనున్నట్లు రమేష్ వర్మ అన్నారు.

కళ్యాణ్ రామ్ "హరేరామ్" సినిమాకు సంగీతం సమకూర్చిన మిక్కీ జె. మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ప్రేమకథా నేపథ్యంలో చిత్రీకరించనున్న ఈ సినిమాలో నటించే వారి నటీనటుల వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు రమేష్ వర్మ తెలిపారు.

తరుణ్, రాజా హీరోలుగా, సలోని హీరోయిన్‌గా నటిస్తోన్న "ఓ ఊరిలో" సినిమా షూటింగ్ జరుగుతోంది. పబ్లిసిటీ డిజైనర్ నుంచి దర్శకుడిగా మారిన రమేశ్ వర్మ "ఒక ఊరిలో" సినిమాకు రవికుమార్ రెడ్డి నిర్మాత సారథ్యం వహించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.
About Writer
Selvi