అల్లు అరవింద్ ఓడిపోలేదు.. తప్పుకున్నారు!
ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అల్లు అరవింద్ ఓడిపోయారని వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని అధ్యక్షునిగా ఎన్నికైన కె.ఎస్. రామారావు తెలియజేశారు.
ఫిలిం ఛాంబర్‌లో సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లు అరవింద్ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారని, ఓ వార్తా పత్రికలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు.
పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అరవింద్ పంపిన లేఖ తమకు ఆలస్యంగా అందిందని, అందుకే బ్యాలెట్ పేపర్లో ఆయన పేరును తొలగించలేదని రామారావు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఆదివారం జరిగిన ఎన్నికల్లో నిర్మాతల సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా సి. కళ్యాణ్, డిస్టిబ్యూటర్స్ సెక్టార్ ఛైర్మన్‌గా బోస్, ఎగ్జిబిటర్స్ ఛైర్మన్‌గా డి. చక్రపాణి, స్టూడియోస్ సెక్టార్ ఛైర్మన్‌గా పి. కిరణ్ ఎన్నికయ్యారు.