వేలాంగణిలో గోపిక దంపతులు!
|
తనకు మంచి భర్తను ప్రసాదించిన ఆ దేవుడికి గోపిక కృతజ్ఞతలు తెలుపుకున్నట్లు గోపిక స్నేహితులు తెలిపారు. వేలాంగణి దర్శించుకున్నఅనంతరం గోపిక ముందు... వేలాది మంది అభిమానులు గుమికూడారు. ఆమె ఆటోగ్రాఫ్ కోసం కొందరు, ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపేందుకు మరికొందరు పోటీ పడ్డారు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో పాటు శుభాకాంక్షలు అందుకున్న గోపిక తదనంతరం ఆమె స్వస్థలానికి బయలు దేరింది.
ఇదిలా ఉండగా, తెలుగు, తమిళ, మళయాళ , కన్నడ భాషల్లో దాదాపు 35 చిత్రాల్లో నటించిన గోపిక వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. 'ఆటోగ్రాఫ్' చిత్రం ద్వారా తమిళతెరకు పరిచయమైన కేరళ కుట్టి గోపిక.. అదే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.