"నాగ చైతన్య" సరసన స్నేహ ఉల్లాల్?
|
నాగ చైతన్య సరసన నటించే హీరోయిన్ కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో... కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఉల్లాసంగా... ఉత్సాహంగా... సినిమాలో స్నేహ ఉల్లాల్ అద్భుతమైన నటనా తీరును వీక్షించి ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సినీ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా, నాగ చైతన్య నటనలో శిక్షణను పూర్తి చేసుకున్నారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజైన ఈ సెప్టెంబర్ 20న నాగ చైతన్య చిత్రరంగ ప్రవేశం చేయనున్నారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ చిత్రానికి కథ ఇప్పటికే సిద్ధమైందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.