బిగ్ ఎఫ్ఎంచే "కుచేలన్" మొబైల్ ఫోటో ఎగ్జిబిషన్
రేడియో తరంగాల ద్వారా శ్రోతలను అలరిస్తున్న బిగ్ 92.7 ఎఫ్ఎం "కుచేలన్" మొబైల్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆవిష్కరించింది. తమిళ సూపర్ స్టార్ తాజాగా నటించిన "కుచేలన్" ఆగస్టు ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో... బిగ్ ఎఫ్ఎం రజనీ అభిమానులను, శ్రోతలను మెప్పించే దిశగా "బిగ్ కుచేలన్ కొండాట్టం" అనే నూతన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
రజనీ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్న "కుచేలన్" సినిమా రిలీజ్‌ను పురస్కరించుకుని.. శ్రోతలకు చేరువయ్యేందుకు గానూ, తాజాగా బిగ్ ఎఫ్ఎం 92.7 "కుచేలన్" మొబైల్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. ఈ ఎగ్జిబిషన్‌ను కోలీవుడ్ టాప్ హీరోయిన్, కుచేలన్ కథానాయిక "నయనతార" తన చేతుల మీదుగా ప్రారంభించారు.
"బిగ్ 92.7 ఎఫ్ఎం" తన "బిగ్ బస్" ద్వారా మొబైల్ ఫోటో ఎగ్జిబిషన్‌ను చెన్నైనగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరింపజేస్తుంది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా చెన్నై వాసులు, రజనీ అభిమానులు "కుచేలన్"లోని సూపర్ స్టార్ స్టిల్స్‌ను వీక్షించడానికి వీలవుతుంది.
ఈ ఎగ్జిబిషన్ గురించి తమిళనాడు బిగ్ ఎఫ్ఎం 92.7 డైరక్టర్ పి.బి. రామస్వామి మాట్లాడుతూ... "కుచేలన్" విడుదలను పురస్కరించుకుని శ్రోతలను వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా ఆకర్షించే దిశగా ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించామని అన్నారు. "కుచేలన్" రాక కోసం అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. ఈ ఎగ్జిబిషన్‌తో బిగ్ ఎఫ్ఎం మరో ఎంజాయ్‌మెంట్ ఆఫర్‌ను శ్రోతలకు అందిస్తోందని చెప్పారు.