నాలుగో షెడ్యూల్‌లో పోలీస్... పోలీస్...
|
ఆగస్టు నాలుగో తేదీ నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా నాలుగో షెడ్యూల్ ప్రారంభం కానుందని దర్శకులు చెప్పారు. శ్రీరామ్, పృథ్వీరాజ్, కమలినీ, బ్రహ్మాజీ వంటి పలువురు తారల సమిష్టి తారాగణమే ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా దండపాణి, విక్రమ్, సివిఎల్, అమిత్ వంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం... చక్రి, ఫోటోగ్రఫీ.. భరణి కె. ధరణ్, ఎడిటింగ్.. శ్రీకార్ ప్రసాద్, ఆన్‌లైన్ ప్రొడ్యూసర్.. భాస్కర్, నిర్మాత... చందు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మన్మోహన్.