"మంత్రకన్య"గా ఛార్మీ!
|
తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అవుతున్న "మంత్ర కన్య" అనే ఈ సినిమాకు కె.వెంకటరెడ్డి, కె. ప్రకాష్‌లు సంయుక్తంగా నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. చంద్రశేఖర్ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు రెండో వారంలో విడుదలకు సిద్ధమైంది.
యాక్షన్-మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో సాగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మరీ "మంత్ర".. "మంత్ర కన్య"గా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే..