ఆగస్టు 15 నుంచి రజనీ "రోబో" షూటింగ్!
|
తమిళ సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గల తన అభిమానులను అలరిస్తూ విడుదలవుతున్న ప్రతీ రజనీ కాంత్ సినిమా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా "కథానాయకుడు" విడుదలను పురస్కరించుకుని యూఎస్‌లో రజనీ అభిమానులు థియేటర్ల ముందు భారీ కట్‌అవుట్లు, పోస్టర్ల ఏర్పాటు చేసి పండుగ చేసుకుంటున్నారు.
అదేవిధంగా "రోబో" షూటింగ్ ప్రారంభం కాక ముందే రజనీ అభిమానులు ఆ సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకోనున్న రోబో సినిమా షూటింగ్ ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మరోవైపు రజనీ కాంత్ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ దర్శకత్వంలో "సుల్తాన్-ది వారియర్" సినిమా ఏప్రిల్-2009 తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.