1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''16 డేస్'' వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన నటి ఛార్మి

కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నటి ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం
WD PhotoWD
కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నటి ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "16 డేస్". ప్రభుసాల్మన్ దర్శకత్వంలో పి.మహేష్‌బాబు, డి.వై.చౌదరిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నటి ఛార్మి ఈ చిత్ర వెబ్‌సైట్‌ '16డేస్ మూవీ.కామ్‌'ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమం ఎఫ్.ఎన్.సి.సి క్లబ్‌లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నటి ఛార్మి మాట్లాడుతూ.... మేకప్ లేకుండా నేచురల్‌గా నా చేత దర్శకుడు షూటింగ్ చేయించారన్నారు. ఈ సినిమాలో నేచురల్‌గా ఉంటానని, తనకు నచ్చిన పాత్ర ఇదని, ఈ సినిమాలో ఎంజిల్‌గా నటిస్తున్నట్టు చెప్పారు. ఎంజిల్ అంటే దేవతా అని అడుగుతున్నారు. సినిమా చూస్తే మీకే తెలుస్తుందన్నారు.

పాజిటీవ్‌తో కూడిన పాత్ర తనదని, ఈక్షణమే నిజం, రేపు అనేది అవాస్తవం అనే తత్వంతో కూడిన పాత్రను చేస్తున్నట్టు చెప్పారు. చాలా కామిక్ గుణాలు పాత్రలో ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ నటులైన కమల్‌హాసన్, రజనీకాంత్, సునీల్, రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి వారిని ఇమిటేడ్ చేస్తానని చెప్పారు. దర్శకుడు కథను చెబుతూ తననే ఈ పాత్ర పోషించమని పట్టుబట్టారని చెప్పారు. ఊహించని విజయాలను ప్రేక్షకులు ఇచ్చారని, అలాగే ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు.

దర్శకుడు ప్రభుసాల్మన్ మాట్లాడుతూ... ఈ సినిమాకి తాను చాలా కష్టపడి, ఇష్టంగా తీశానన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉందన్నారు. ఈ చిత్రం రావడానికి కారణమైన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. కోటగారు ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రను పోషించారని, క్లైమెక్స్‌లో ఆయన చేసే సన్నివేశం ఈ చిత్రంలో హైలెట్‌గా ఉంటుందన్నారు. సీనియర్ నటుడు క్వారీలో చేసే ఆ సీన్స్‌కు ఎంతో సహకరించారన్నారు.

ఈ చిత్రంలో ఛార్మి ఎంజిల్‌గా నటిస్తోందన్నారు. ఇక హీరో అరవింద్ 'వితౌట్ పేన్ నో గైన్' అన్నట్లుగా చాలా కష్ట పడ్డారని కొన్నాళ్ళు ఆస్పత్రిపాలయ్యారని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ధరణ్ కొత్త ట్రెండ్‌ను, సృష్టించారన్నారు.

సినీ నిర్మాత చౌదరి మాట్లాడుతూ... ప్రభుసాల్మన్‌‌పై ఉన్న గట్టి నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. మొదట అనుకున్న దానికంటే బడ్జట్ ఎక్కువే అనిపించినా టెక్నికల్‌గా ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ముందుకు సాగామని, రషెస్ చూశాక చాలా తృప్తి చెందామన్నారు. ఆగస్టు నెలాఖరులో సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేయనున్నామని తెలిపారు. అనంతరం

నటుడు కోట మాట్లాడుతూ... ఇది కేవలం దర్శకుడి ప్రతిభకు తార్కాణమని. తాను ఎంతో కష్టపడినా దర్శకుని టాలెంట్ ఈ చిత్రంలో ఉందన్నారు. కథ గురించి చెప్పాలంటే తమిళనాడులో ఎవరైనా చనిపోతే కర్మకాండలకు 16వ రోజు చేస్తామని, ఈ చిత్రానికి అదే మూలం అని చెప్పారు.
About Writer
PNR