1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆగస్టు రెండో వారంలో "అంకుశం" ఆడియో

వినోదం వెండితెర కథనాలు శ్రీనాథ్ రితీష్ సంగీత కీర్తిచావ్లా ఆగస్టు రెండో వారం అంకుశం ఆడియో
WD
షాఖ్య సెల్యూలాయిడ్ పతాకంపై శ్రీనాథ్, రితీష్, సంగీత, కీర్తిచావ్లా కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "అంకుశం". ఈ సినిమా ఆడియో ఆగస్టు రెండో వారంలో విడుదల చేయనున్నట్లు నిర్మాత దర్శకుడు కె. విజయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. మాఫియా ముఠాలో చిక్కుకున్న అమ్మాయిల్ని, వారి చెరలో బందీగా ఉన్న కుటుంబాన్ని విడిపించడానికి జులాయిలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎలా రక్షించారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని వివరించారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోందని, ఈ నెల 20 నాటికి తొలికాపీ సిద్ధం కానుందని నిర్మాత చెప్పారు. సెప్టెంబరులో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విజయ్ కుమార్ అన్నారు. ఇంకా చిత్రానికి కెమెరా... అబూషా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత.. కె.విజయ్ కుమార్ రెడ్డి.